Header Banner

ఏపీలో పదో తరగతి ఫలితాల డేట్ ఫిక్స్! కానీ ఓ ట్విస్ట్ ఉంది.! ఈ సారి గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే!

  Thu Apr 10, 2025 10:23        Education

ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాకనం పూర్తి కావస్తోంది. అనంతరం వీటిని కంప్యూటరీకరించే ప్రక్రియ మొదలవుతోంది. ఇది పూర్తి కాగానే ఫలితాల విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎలా తెలుసుకోవాలన్న దానిపై ఎస్సెస్సీ బోర్డు క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ ఆప్షన్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.


ఈసారి రాష్ర్లంలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుండి 30 వరకు నిర్వహించారు. ఇందులో 6.5 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. వీరంతా ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో పదో తరగతి పరీక్ష ఫలితాల్ని ఈ నెల 22న విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 1న పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 15 కల్లా ఇది పూర్తవుతుందని భావిస్తున్నారు. అనంతరం ఫలితాల కంప్యూటరీకరణ ప్రారంభం కానుంది.


ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

ఈసారి కూడా ఎప్పటిలాగే పదో తరగతి పరీక్షా ఫలితాలను bse.ap.gov.in వెబ్‌సైట్‌ లో ప్రభుత్వం అందుబాటులో ఉంచబోతోంది. వెబ్ సైట్ లోకి ఎంటర్ అయ్యాక విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు. అలాగే వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే వివిధ ప్రైవేటు వెబ్ సైట్లలోనూ ఫలితాలు అందుబాటులోకి రాబోతున్నాయి. కాబట్టి విద్యార్ధులు అప్పటివరకూ వేచి చూడక తప్పదు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #AP10thResults2025 #SSCResultsAP #BSEAP2025 #APBoardResults #10thClassResults #APSSCResults